📄 ePaper
Tuesday, July 28, 2026
Homeఆంధ్రప్రదేశ్జగన్ జన్మదినం వేడుకల్లో ఘర్షణలపై టీడీపీ కఠిన విమర్శలు

జగన్ జన్మదినం వేడుకల్లో ఘర్షణలపై టీడీపీ కఠిన విమర్శలు

📰 Generate e-Paper Clip

మీడియాసమావేశంలోరెడ్డివారిగురవారెడ్డి తీవ్రవ్యాఖ్యలు
జగన్ జన్మదిన వేడుకల్లో జరిగిన ఘటనలను ఖండించిన రాష్ట్ర అధికార ప్రతినిధి
మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం,డిసెంబర్23
రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో చోటుచేసుకున్న ఘటనలను తీవ్రంగా ఖండించారు.జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా కొందరు వైసీపీ కార్యకర్తలు గొర్రెలు, మేకలను బహిరంగంగా వేటకొడవలతో నరికి, ఆ రక్తంతో జగన్ చిత్రపటాలకు రక్తాభిషేకం చేయడం సమాజంలో సభ్య సమాజం తలదించుకునే చర్యగా పేర్కొన్నారు. ఇటువంటి దుర్మార్గ చర్యలను జగన్ పార్టీ సమర్థిస్తుందా అని సూటిగా ప్రశ్నించారు.అదేవిధంగా సత్యసాయి జిల్లా ముత్యావాడ్లపల్లి గ్రామంలో బాణాసంచా కాల్చడంపై అభ్యంతరం తెలిపిన 7 నెలల నిండు గర్భిణీ సంధ్యారాణిపై దాడి చేయడం అత్యంత అమానుషమని అన్నారు. ఈ ఘటనలో ఆమె గర్భంలోని శిశువు చలనం నిలిచిపోయినట్లు పత్రికలు, మీడియా ద్వారా తెలిసిందని పేర్కొంటూ, ఈ సంఘటన రాష్ట్ర ప్రజలను కలచివేసిందన్నారు.
ఘటనపై మహిళా కమిషన్ సుమోటోగా కేసులు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జన్మదిన వేడుకల పేరుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బందులు కలిగించడం కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.గతంలో 2019–24 మధ్యకాలంలో జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై ప్లెక్సీలు కట్టడం, జన్మదినాలు జరపడం వంటి అంశాలపై ఆంక్షలు విధించి అక్రమ కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్వేచ్ఛలు, రాజ్యాంగ వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు.
రక్తాభిషేకాలు, హింసాత్మక ఘటనల ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం సమంజసం కాదని పేర్కొంటూ,జగన్‌మోహన్ రెడ్డివైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular