📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలు17,18వ వార్డుల అభివృద్ధికి బిఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేయాలి

17,18వ వార్డుల అభివృద్ధికి బిఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేయాలి

📰 Generate e-Paper Clip

•వార్డుల సమగ్ర అభివృద్ధికి బిఆర్ఎస్‌కే మద్దతు-ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సహకారంతోనే ముందడుగు
సదాశివాపేటలో వార్డు సమావేశంలో నేతల పిలుపు
సదాశివాపేట,ఫిబ్రవరి3(మనప్రజాప్రతినిధి):
సదాశివాపేట పట్టణంలోని 17,18వ వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు కామిల్, ఎండి లతీఫ్ ఆధ్వర్యంలో వార్డు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎన్నికల అబ్జర్వర్ మటన్ బిక్షపతి, బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు చింత సాయినాథ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17, 18వ వార్డుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు. వార్డుల సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సహకారంతోనే సాధ్యమవుతుందని తెలిపారు.అభ్యర్థులు ఎండి లతీఫ్, కామిల్ మాట్లాడుతూ, కౌన్సిలర్లుగా తమను గెలిపిస్తే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తామని హామీ ఇచ్చారు. వార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యులు కోడూరు అంజయ్య, సలావుద్దీన్, నర్సింలు, మనోహర్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular