📄 ePaper
Tuesday, July 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకూడవెల్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న గజాబింకర్ అశోక్ దంపతులు

కూడవెల్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న గజాబింకర్ అశోక్ దంపతులు

📰 Generate e-Paper Clip


ప్రజల సంక్షేమం, రైతుల సుభిక్షానికి శివుడిని ప్రార్థించిన కాంగ్రెస్ నాయకులు
అక్బర్‌పేట్.భూంపల్లిమండలం,(మనప్రజాప్రతినిధి):
నేషనల్ కాంగ్రెస్ వారియర్స్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గజాబింకర్ అశోక్ దంపతులు కూడవెల్లి శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించి గుడిగంటను సమర్పించారు.
పూజల అనంతరం గజాబింకర్ అశోక్ మాట్లాడుతూ, శివుని ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని, రైతుల పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుభిక్షం కలగాలని ప్రార్థించారు.
అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, శివుని కృప ఎల్లవేళలా వారిపై ఉండాలని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ కాంగ్రెస్ వారియర్స్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గజాబింకర్ అశోక్‌తో పాటు గ్రామస్తులు, భక్తులు, ఇతరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular