దరఖాస్తు పంపేందుకు లంచం డిమాండ్
రూ.15 వేల స్వీకరించే సమయంలో రంగెహస్తం
ఫిర్యాదుదారుల వివరాలు గోప్యమేనని అనిలబ్ధిదారునిశా హామీ
ఖమ్మం, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
ఖమ్మం జిల్లాలో లంచం తీసుకుంటూ సహాయ కార్మిక అధికారి కర్నె చందర్ అనిశా (అవినీతి నిరోధక శాఖ) అధికారులకు పట్టుబడ్డారు. తన తండ్రి మరణానికి సంబంధించిన లబ్ధిదారుడు దరఖాస్తును ఉన్నతాధికారులకు పంపించేందుకు, అంత్యక్రియల ఖర్చులుగా మంజూరు అయ్యే లక్షా ముప్పై వేల రూపాయలు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలంటే లంచం ఇవ్వాలని ఫిర్యాదుదారుని బెదిరించినట్లు అనిశా వెల్లడించింది. దరఖాస్తు పంపే ప్రక్రియలో సహకరిస్తానని చెప్పి రూ.15 వేల లంచం స్వీకరించే సమయంలోనే చందర్‌ను అధికారులు రంగెహస్తం పట్టుకున్నారు. తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కింద ఈ ఆర్థిక సహాయం అందుతుండగా, అర్హత ఉన్నవారిని ప్రయోజనం చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయితే వెంటనే అనిశా టోల్ ఫ్రీ నంబర్ 1064 కి కాల్ చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా 9440446106 కు, ఫేస్‌బుక్ మరియు ఎక్స్ వేదికల ద్వారా కూడా ఫిర్యాదులను నమోదు చేయవచ్చని శాఖ తెలిపింది. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని కూడా హామీ ఇచ్చింది.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సహాయ కార్మిక అధికారి
RELATED ARTICLES

