📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఎన్నికల ప్రచార ఖర్చులు పకడ్బందీగా నమోదు చేయాలి.ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్

ఎన్నికల ప్రచార ఖర్చులు పకడ్బందీగా నమోదు చేయాలి.ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్

📰 Generate e-Paper Clip

మన ప్రజాప్రతినిధి – రాజన్నసిరిసిల్ల. నవంబర్ 28
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్థులు చేసే వ్యయాన్ని పూర్తిస్థాయిలో, పారదర్శకంగా నమోదు చేయాలని ఇంచార్జికలెక్టర్,జిల్లాఎన్నికలఅధికారిగరిమఅగ్రవాల్ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారంనిర్వహించిన సహాయ వ్యయ పరిశీలకుల (AEOs) శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో వ్యయ పర్యవేక్షణ అత్యంత కీలకమని, ప్రతి అభ్యర్థి తన ఖర్చులను రిజిస్టర్లలో కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు.ఆమెతో పాటు వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్, నోడల్ అధికారి శేషాద్రి కూడా ఎన్నికల ఖర్చుల నియంత్రణపై సూచనలు అందించారు.
వ్యయ పరిమితులు — అధికారుల వివరాలు
5,000 మందికంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఖర్చు పరిమితి: ₹2,50,000
5,000 మందికంటే తక్కువ జనాభా ఉన్న GP సర్పంచ్ అభ్యర్థి పరిమితి: ₹1,50,000
5,000 మందికంటే ఎక్కువ జనాభా ఉన్న GP వార్డు సభ్యుడి పరిమితి: ₹50,000

5,000 మందికంటే తక్కువ జనాభా ఉన్న GP వార్డు సభ్యుడి పరిమితి: ₹30,000అభ్యర్థులు ఎన్నికల వ్యయాల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా ప్రారంభించాలని, ప్రతి రూపాయి ఖర్చును రిజిస్టర్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.అలాగే ₹50,000 కంటే ఎక్కువ నగదు వెంట తీసుకెళ్లరాదని ఆమె స్పష్టం చేశారు.శిక్షణా కార్యక్రమంలో డీపీఓ షరీఫుద్దిన్తో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.