📄 ePaper
Sunday, August 30, 2026
Homeఆంధ్రప్రదేశ్స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్‌తో సుపరిపాలన లక్ష్యం

స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్‌తో సుపరిపాలన లక్ష్యం

📰 Generate e-Paper Clip

కుటుంబ సమగ్ర సమాచారంతో సేవల పర్యవేక్షణ
జూన్ నాటికి 1.4 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ కార్డులు
రియల్ టైమ్ డేటాతో పథకాల పారదర్శక అమలు

అమరావతి, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):

రాష్ట్రంలో సుపరిపాలనను మరింత బలోపేతం చేస్తూ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్‌ సిస్టం (FBMS) పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఒక్క కార్డు ద్వారా అందుబాటులో ఉండే విధంగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డు రూపొందించాలనీ ఆయన స్పష్టం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్‌ ఆధారంగా కుటుంబ, వ్యక్తిగత వివరాలు సేకరించేందుకు అధికారులకు సూచనలు జారీ చేశారు.
రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ 2026 నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను అందజేయాలని సీఎం ఆదేశించారు. ఈ కార్డు ద్వారా 25 రకాల సేవలు అందుబాటులో ఉండాలనీ, పీ4 వంటి అంశాలూ ఇందులో కలగాలన్నారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న డేటాను ఇతర శాఖలూ ప్రామాణికంగా తీసుకుని సేవల అందింపులో ఉపయోగించుకునేలా వ్యవస్థను రూపొందించాలని చెప్పారు. స్టాటిక్, డైనమిక్ డేటా రెండూ నిరంతరం అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. వాక్సినేషన్, ఆధార్, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు, స్కాలర్‌షిప్, పెన్షన్లు సహా వివిధ ప్రభుత్వ పథకాల వివరాలు ఈ కార్డు ద్వారా ట్రాక్ అయ్యే విధంగా వ్యవస్థను విస్తరించాలన్నారు. కేవలం రేషన్, పెన్షన్ల వరకే కాకుండా పౌరుల సమాచారమంతా ఈ ఎఫ్‌బీఎంఎస్‌లో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. లబ్దిదారుల ఎంపికలో ఎదురయ్యే సవాళ్లు కూడా ఈ సిస్టమ్ ద్వారా పరిష్కారమవుతాయని ఆయన గుర్తించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల ద్వారా కుటుంబ వివరాలు నిరంతరంగా అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం విలేకరులతో తెలిపారు. ఆధార్ సహా పౌరులకు సంబంధించిన అన్ని సమాచారమూ ఒక్క ఫ్యామిలీ కార్డ్‌లోనే కనిపించేలా సాంకేతికంగా అభివృద్ధి చేయాలని సూచించారు. జనవరి 2026 నాటికి పూర్తి వివరాలను క్రోడీకరించి, జూన్ నాటికి కార్డుల పంపిణీ పూర్తిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.