Tuesday, April 14, 2026
ads
Homeహెల్త్&ఫిట్నెస్క్యాన్సర్‌ను అడ్డుకొనే సపోటా

క్యాన్సర్‌ను అడ్డుకొనే సపోటా

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//ఏపీ టి ఎస్: మనకు దొరికేటువంటి పండ్ల లో సపోటా పండు కూడా ఒకటి. ఈ సపోట ను తినడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాకుండా ఎలాంటి పొట్ట నైన తగ్గించే గుణం ఉన్నది.సపోటా పండులో ముఖ్యంగా విటమిన్స్‌ పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి .సపోటా పండును రోజుకొకటి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ క్రియ కూడా పెరుగు పడుతుంది. శరీరంలో ఉండేటువంటి అదనపు కేలరీలను సైతం కరిగించేలా చేస్తుంది. సపోటాలు కాస్త చెక్కెర గుణం ఎక్కువగానే ఉంటుంది.సపోటా కాయలో ఉండేటువంటి పోషకాలు జీర్ణా క్రియ క్యాన్సర్‌ ను అడ్డుకోవడం

లో చాలా ఉపయోగపడుతుంది.. సపోటాలు తింటే శరీరానికి గ్లూకోజ్‌ బాగా లభిస్తుంది. ఇందులో ఉండేటువంటి ఫైబర్‌ వల్ల మలబద్ధక సమస్యను కూడా పరిష్కరిస్తుంది. సపోటా తినడం వల్ల తరచూ ఆకలి అనేది వేయదట. సపోటాలో ఉండేటువంటి విటమిన్స్‌ వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఎముకలని కూడా బలపరచడానికి సపోటా కాయలు చాలా ఉపయోగపడతాయి. కిడ్నీలోని రాళ్ళను ఏర్పడకుండా చేయడానికి సపోటా చాలా ఉపయోగపడుతుంది.. జట్టు రాలడం చుండ్రు వంటి సమస్యను కూడా తగ్గించడానికి ఈ సపోటా ఎక్కువగా ఉపయోగపడుతుందట. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు సపోటాను తినడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ఇతర పండ్లతో పోలిస్తే సపోటాలో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అయితే సపోటా తినడానికి రుచిగా అనిపిస్తుంది. అయితే మధుమేహ వ్యాధి గ్రహస్తులు సైతం ఈ పండుని తినకపోవడమే మంచిదంటూ వైద్యులు సైతం తెలియజేస్తూ ఉంటారు. సపోటాలో ఉండేటువంటి విటమిన్‌ ఏ వల్ల కంటి సమస్యలను సైతం దూరం చేస్తుందట. ఎవరైనా నిద్రలేని సమస్యతో ఒత్తిడితో ఇబ్బంది పడేవారు సపోటా జ్యూస్‌ తాగడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ప్రతిరోజు ఒక సపోటా తినడం వల్ల స్లిమ్ముగా మారుతారట.

2
కొలెస్ట్రాల్‌ సమస్యని సూపర్‌ ఫుడ్స్‌
కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడే వారు పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్‌ ఇ తో పాటు మోనోశాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు క్యాన్సర్‌ ముప్పు కూడా తగ్గుతుంది.జనపనార విత్తనాలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ప్రోటీన్‌ తో పాటు గామా లినోలెనిక్‌ యాసిడ్‌ ఉంటుంది. కొలెస్ట్రాల్‌ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి చక్కగా పని చేస్తాయి. కొలెస్ట్రాల్‌ ను తగ్గించడంలో గుమ్మడి గింజలు కూడా చక్కగా పని చేస్తాయి. ఈ గింజలల్లో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, మోనోశాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి.కొలెస్ట్రాల్‌ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. నువ్వులకు కూడా కొలెస్ట్రాల్‌ ను తగ్గించే గుణం ఉంది. వీటిలో యాంటీ ఇన్‌ ప్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కొలెస్ట్రాల్‌ ను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.కొలెస్ట్రాల్‌ ను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అవిసె గింజలు మనకు ఎంతగానో సహాయపడతాయి. వీటిని లిన్సీడ్స్‌ అని కూడా అంటారు. ఈ గింజలల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవిమనకు ఎంతో సహాయపడతాయి. కొలెస్ట్రాల్‌ సమస్యను తగ్గించడంలో చియా విత్తనాలు కూడా ఎంతో దోహదపడతాయి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడుకొలెస్ట్రాల్‌ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతో దోహదపడతాయి.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలను తీసుకోవాలి. కొలెస్ట్రాల్‌ ను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ విత్తనాలు మనకు ఎంతగానో సహాయపడతాయి. ఈ విత్తనాల్లో ఫైబర్‌ తో పాటు శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
………………….

 

3
వేడి నీటిని తాగితే కలిగే లాభాలు
వేడి నీటిని తీసుకోవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ వేడి నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.వేడి నీరు కండరాలు రిలీఫ్‌ అయ్యేలా చేస్తుంది. ఆర్థరైటిస్‌, కండరాల ఒత్తిడి వంటి పరిస్థితులతో సంబంధం ఉన్న నొప్పిని తగ్గించడంలో సాయపడుతుంది. ప్రభావిత ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని ప్రసరించేలా చేస్తుంది. వాపును తగ్గిస్తుంది.వేడి నీటిని తాగడం వలన ఆకలిని అణిచివేస్తుంది. బరువు తగ్గించడంలో వేడి నీరు సాయపడుతుంది. అదనంగా, శరీరంలో కొవ్వు నిల్వలను విచ్ఛిన్నం చేయడంలో సాయపడుతుంది. బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది.వేడి నీరు రక్త నాళాలను విస్తరించడంలో సాయపడుతుంది. శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగుపరిచేలా చేస్తుంది. కణాలకు మెరుగైన ఆక్సిజన్‌, పోషకాల పంపిణీని అందిస్తుంది. అలాగే కణజాలాల నుంచి వ్యర్థాల తొలగింపుకు దారితీస్తుంది.తేనె, నిమ్మకాయతో కూడిన వేడి నీరు మంట, చికాకును తగ్గించడంలో సాయపడుతుంది. తద్వారా గొంతు నొప్పిని తగ్గిస్తుంది. గొంతును తేమగా ఉంచడంలో సాయపడుతుంది. అసౌకర్యం నుంచి ఉపశమనం అందిస్తుంది.వేడి నీరు ఆహార కణాల విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలికను ప్రోత్సహిస్తుంది. కడుపు కండరాలను విశ్రాంతి, ఉపశమనాన్ని కలిగిస్తుంది. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.అయితే విపరీతమైన వేడి నీరు మాత్రం అస్సలు తాగకూడదు. నోటి, అన్నవాహిక సున్నితమైన కణజాలాలకు నష్టాన్ని కలిగిస్తుంది. వేడి నీటిని తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. క్రమం తప్పకుండా వేడి నీటిని తాగడంతో పాటు సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను కలిగి ఉండాలి. శ్రేయస్సుకు దోహదం చేస్తుంది.వేడి నీటిలో నిమ్మకాయ, తేనె, అల్లం లేదా మూలికలు వంటి పదార్థాలను కలిపితే ఎంతో రుచిని మెరుగుపరుస్తుంది. అదనపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

4
పాలలో ఇది కలిపి తాగితే
చాలా ఆరోగ్యంగా ఉంటారు?
ఇసాబ్గోల్‌ ను పాలలో కలిపి తీసుకోవడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. శరీరంలో డిటాక్సిఫికేషన్‌ ప్రక్రియను మెరుగుపరచడంలో ఇసాబ్గోల్‌ మనకు సహాయపడుతుంది. ఇసాబ్గోల్‌ ను తీసుకోవడం వల్ల ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది.దీనిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం సహజంగా ప్రకాశవంతంగా తయారవుతుంది. అలాగే ఇసాబ్గోల్‌ ను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధులు, ఇన్పెక్షన్‌ లు మన దరి చేరకుండా ఉంటాయి. ఇసాబ్గోల్‌ ను తీసుకోవడం వల్ల ఇరిటెబుల్‌ బౌల్‌ సిండ్రోమ్‌ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ సమస్య వల్ల కలిగే పొత్తి కడుపులో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా ఇసాబ్గోల్‌ మనకు సహాయపడుతుంది. పాలతో కలిపి దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువును అదుపులో ఉంచడంలో కూడా ఇసాబ్గోల్‌ మనకు సహాయపడుతుంది. దీనిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది.త్వరగా మనం తీసుకునే క్యాలరీల సంఖ్య తగ్గుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు.ఇసాబ్గోల్‌ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. దీనిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం సహజంగా ప్రకాశవంతంగా తయారవుతుంది. అలాగే ఇసాబ్గోల్‌ ను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధులు, ఇన్పెక్షన్‌ లు మన దరి చేరకుండా ఉంటాయి.ఇసాబ్గోల్‌ ను పాలతో కలిపి తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్‌ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

5
పాషన్‌ ఫ్రూట్‌తో ఆరోగ్యం
పాషన్‌ ఫ్రూట్‌ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్‌ ఎ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ ఏ మన కంటి చూపును మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఈ పండు రేచీకటి, దృష్టి లోపం వంటి సమస్యలను చాలా ఈజీగా దూరం చేస్తుంది. ఈ పండు తినడం వల్ల మన ఎముకలు, దంతాలు ఎంతో దృఢంగా కూడా ఉంటాయి. అలాగే ఈ పండు తినడం వల్ల మన ఊపిరితిత్తులు ఎంతో బలోపేతమవుతాయి. అలాగే ఈ పండు తింటే శ్వాస సమస్యలు కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి.ఈ పండు శరీరంలో వాపును తగ్గిస్తుంది. పాషన్‌ ఫ్రూట్‌ గుజ్జులో చాలా డైటరీ ఫైబర్‌ ఉంటుంది. ప్రతి ఆహారంలో ఫైబర్‌ కీలకమైన భాగం. ఇది జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరించడానికి, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ప్యాషన్‌ ఫ్రూట్‌ సీడ్స్‌లో ఉండే సమ్మేళనం మన ఇన్సులిన్‌ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇన్సులిన్‌ సెన్సిటివిటీని మెరుగుపరచడం మధుమేహంతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పాషన్‌ ఫ్రూట్‌లో విటమిన్‌ ఎ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది చర్మం, దృష్టి, రోగనిరోధక వ్యవస్థకు ముఖ్యమైనది. ఇందులో విటమిన్‌ సి కూడా పుష్కలంగా ఉంటుంది. పాషన్‌ ఫ్రూట్‌లో విటమిన్‌ ఎ అధిక స్థాయిలో ఉంటుంది. పాషన్‌ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడే సమ్మేళనం. శరీర వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడంలో యాంటీఆక్సిడెంట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది సెల్యులార్‌ ఒత్తిడిని తగ్గిస్తుంది.ఈ పండులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి సహాకరిస్తుంది.

6
తలనొప్పికి ఇలా చెక్‌
ప్రస్తుత కాలంలో చాలా మందికి రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. మారుతున్న జీవన విధానం , తీసుకునే ఆహారంలో మార్పులు, పలు కారణాల వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ఇకపోతే జీవన శైలిలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు సైతం సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవికాలం వచ్చిందంటే చాలు చాలామంది విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. కొద్దిసేపు అలా ఎండలో తిరిగి వస్తారో లేదో ఇలా తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి తీవ్రమైన నొప్పి మరింత బాధపెడుతుంది. ఇందులో రోగి తలనొప్పితో పాటు కడుపు సమస్యలు, వాంతులు, వికారం మొదలైన వాటితో బాధపడవచ్చు. ఇక మీరు కూడా తలనొప్పి, మైగ్రేన్‌ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే పొరపాటున కూడా వీటిని తీసుకోకండి.చాక్లెట్‌.. మైగ్రేన్‌ లేదా తలనొప్పి అధికంగా ఉండి బాధపడేవాళ్లు చాక్లెట్‌ అస్సలు తినకూడదు. చాక్లెట్లో కెఫిన్‌ , బీటా ఫెనీలేతైలమైన్‌ ఉంటాయి. అవి రక్తనాళాలలో ఉద్రిక్తతను కలిగించి, తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి తలనొప్పి అధికంగా ఉండేవారు చాక్లెట్‌ కి దూరంగా ఉండండి.
కాఫీ.. సాధారణంగా మనకు తలనొప్పి వచ్చిందంటే టీ లేదా కాఫీ తీసుకోవడం చాలా మందికి అలవాటు.. కానీ కాఫీ తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని అనుకున్నా ..ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు.. కాఫీలో ఉండే కెఫిన్‌ మెదడు నరాల పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల మెదడులో రక్తప్రసరణ మందగించి మరింత తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది.సిట్రస్‌ పండ్లు.. తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు నారింజ, నిమ్మ, కివి వంటి నిమ్మ జాతి పండ్లను తీసుకోకూడదు. ఇది ఆరోగ్యానికి మంచిదే అయినా మైగ్రేన్‌ సమస్య ఉన్నప్పుడు తీసుకుంటే సమస్య మరింత ఎక్కువవుతుంది.

 

7
అతి నిద్రతో భయంకరమైన నష్టాలు
అతి నిద్ర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మీరు 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే ఇది సాధారణమైనది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయంగా చెబుతున్నారు..ఇది నిద్ర రుగ్మత లేదా ఏదైనా ఇతర అనారోగ్య సమస్య కావొచ్చునని అంటున్నారు. డిప్రెషన్‌, మానసిక సమస్యలు, గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌, క్రానిక్‌ పెయిన్‌, స్లీప్‌ అప్నియా, నిద్రలేమి, హైపోథైరాయిడిజం, డిప్రెషన్‌ లేదా యాంగ్జయిటీ, కార్డియోవాస్క్యులార్‌ డిసీజ్‌ వంటి నిద్ర రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది.8 గంటల కన్నా ఎక్కువ సమయం నిద్రపోయే వారిలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముప్పు అధికంగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అతిగా నిద్రపోవటం వల్ల బరువు పెరుగుతారు. తలనొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు, డయాబెటిస్‌ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. శరీరం కొవ్వును ఎక్కువగా నిల్వ చేసుకుంటుంది. ఫలితంగా గుండె సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అతిగా నిద్ర పోయే వారిలో డిప్రెషన్‌, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు వస్తాయంటున్నారు. అతిగా నిద్రపోయే వారిలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. అంతేకాదు.. అతిగా నిద్రపోయేవారు విపరీతమైన అలసటను అనుభవిస్తారు. ఏ పనీ చేయబుద్ది కాదు. చిన్న పని చేసినా అలసిపోతుంటారని నిపుణులు చెబుతున్నారు.7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచుతుంది. సరైన నిద్ర అనంతరం మేల్కొన్నప్పుడు, మీరు చాలా రిలాక్స్‌గా ఉంటారు. రోజంతా హాయిగా గడిచిపోతుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular