📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణసినిమా పైరసీపై హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ ప్రశంసనీయం

సినిమా పైరసీపై హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ ప్రశంసనీయం

📰 Generate e-Paper Clip


– ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు
– ఐబొమ్మ–బప్పమ్ వెబ్‌సైట్ల నిర్వహకుడు అరెస్ట్ – చిత్ర పరిశ్రమకు పెద్ద ఊరటన
– బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్‌పై సజ్జనార్ చర్యలను డిప్యూటీ సీఎం ప్రశంస
– భారతీయ సినిమా రంగం రక్షణకు ముఖ్యమైన అడుగు

అమరావతి, నవంబర్ 17 (మనప్రజాప్రతినిధి):
సినిమా పైరసీ ముఠా‌పై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. పైరసీ వల్ల చిత్ర పరిశ్రమకు కలుగుతున్న తీవ్రమైన నష్టాన్ని గుర్తు చేస్తూ, ఇటువంటి ముఠాలు సినిమాలు విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పెట్టడం నిర్మాతలు, దర్శకులకు పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు.పైరసీకి కేంద్రమైన ఐబొమ్మ, బప్పమ్ వెబ్‌సైట్ల నిర్వాహకుడిని అరెస్ట్ చేసి, ఆ ప్లాట్‌ఫారమ్‌లను మూయించివేయడం ముఖ్యమైన ముందడుగు అని పవన్ కల్యాణ్ తెలిపారు. పోలీసులకు సవాలుగా మారిన ఈ ముఠాను ఛేదించడంలో సైబర్ క్రైం బృందం చూపిన నైపుణ్యం ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు. ఇంకా, బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ వంటి ప్రజల ఆర్థిక భద్రతను దెబ్బతీసే వ్యవస్థలపై కూడా వి.సి. సజ్జనార్ తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా చైతన్యం కలిగిస్తున్నాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ వ్యవస్థల వల్ల ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారో ఆయన స్వయంగా వివరిస్తూ సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నారని గుర్తు చేశారు. సినిమా రంగాన్ని రక్షించడంలో ఈ చర్యలు పెద్ద సహాయం చేస్తాయని, ప్రత్యేకంగా తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా యావత్ భారతీయ సినిమా పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.