📄 ePaper
Tuesday, July 14, 2026
Homeఇంటర్నేషనల్ప్రపంచ వేదికపై భారత నేవీ గర్వకారణం

ప్రపంచ వేదికపై భారత నేవీ గర్వకారణం

📰 Generate e-Paper Clip

ప్రపంచ బాక్సింగ్ కప్‌లో మెరిసిన నేవీ బాక్సర్ హితేష్ గులియా
బ్రెజిల్, ఖజకిస్తాన్, భారత్‌లో స్వర్ణ మెడల్స్ దక్కించుకున్న విజయయాత్ర
కోచ్ సురన్జయ్ సింగ్‌కు కూడా ఘన అభినందనలు
న్యూఢిల్లీ, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):
ప్రపంచ బాక్సింగ్ కప్ సిరీస్–2025లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన భారత నేవీ బాక్సర్ హితేష్ గులియాను నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి ఘనంగా సత్కరించారు. అతడి కోచ్ ఎం. సురన్జయ్ సింగ్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు అందుకున్నారు. హితేష్ గులియా ఈ ఏడాది బ్రెజిల్, ఖజకిస్తాన్‌లో నిర్వహించిన బాక్సింగ్ వరల్డ్ కప్స్‌లో స్వర్ణం, రజత పతకాలు గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. నవంబర్ 2025లో భారతదేశంలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో మరో స్వర్ణం సాధించి, ప్రపంచ స్థాయి బాక్సర్ల సరసన తన స్థానం పక్కగా నిలబెట్టుకున్నాడు. ఈ విజయయాత్ర భారత నేవీకి అసాధారణ గర్వకారణంగా నిలిచినట్టుగా అధికారులు పేర్కొన్నారు. సీఎన్‌ఎస్ అడ్మిరల్ త్రిపాఠి, హితేష్ గులియాను ప్రపంచ వేదికపై భారత జెండాను ఎగురవేయడంలో చూపిన కృషికి అభినందించారు. కోచ్ సురన్జయ్ సింగ్‌కు ఆయన అందించిన శిక్షణ, క్రమశిక్షణ,మార్గనిర్దేశం కోసం ప్రత్యేక శ్లాఘనలు తెలిపారు. నేవీలో ఉన్నత క్రీడా ప్రతిభను పెంపొందించడంలో ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. భారత నావికాదళం క్రీడా రంగంలో యువ ప్రతిభను తీర్చిదిద్దడంలో తీసుకుంటున్న చర్యలకు ఈ విజయం మరో మైలురాయిగా నిలిచింది. భవిష్యత్‌లో మరింత మంది నేవల్ అథ్లెట్లు అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించేలా మద్దతు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular