📄 ePaper
Tuesday, July 14, 2026
Homeఆంధ్రప్రదేశ్ఉత్తర ద్వారం విశేషతతో ఘనంగా వైకుంఠ ఏకాదశి

ఉత్తర ద్వారం విశేషతతో ఘనంగా వైకుంఠ ఏకాదశి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//తెలంగాణ-ఆంధ్రప్రదేశ్.డిసెంబర్ 30
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం విశేషత
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినమైన వైకుంఠ ఏకాదశిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీమహావిష్ణువు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తాడని పురాణాల్లో ప్రస్తావన ఉంది.
వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే పాప విముక్తి లభించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ దినాన భక్తులు ఉపవాసాలు, జపాలు, భజనలు చేస్తూ శ్రీమన్నారాయణునినామస్మరణలోలీనమవుతారు.ప్రత్యేకంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు రాష్ట్రాల్లోని ప్రముఖ విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతు న్నాయి.వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం, సుఖశాంతులు, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఈ పర్వదినం ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ధర్మమార్గంలో నడవాలని సందేశాన్ని ఇస్తోంది.వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్.ప్రజలందరికీ మనప్రజాప్రతినిధి పత్రిక& ప్రజా ప్రతినిధి టీవీ ఛానల్  తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు.
శ్రీమహావిష్ణుని కృపతో ప్రజలందరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాము.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular