మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్30
ఇల్లంతకుంట ఫ్రెండ్స్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ మామిడి రాజు గారిని ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి, ఆటో యూనియన్ సభ్యులు ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జుట్టు నరేష్, పత్తి కుంట పల్లె నాయిని శ్రీనివాస్, అలాగే వంతడుపుల ఆటో యూనియన్ సభ్యుల సమక్షంలో సర్పంచ్‌ను పూలమాలలతో సత్కరించారు.ఈ సన్మాన సభలో ఇల్లంతకుంట ఆటో యూనియన్ అధ్యక్షుడు సావనపెల్లి రవితో పాటు నరేందర్, మల్లేశం, జి. తిరుపతి, అంజి, జగన్,పరశు రాం రాజు, నారాయణ, డి. తిరుపతి తదితరులు పాల్గొని సర్పంచ్ మామిడి రాజును అభినందించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ మామిడి రాజు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ మామిడి రాజుకు ఘన సన్మానం
RELATED ARTICLES

