📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుబీజేపీ కుట్రలకు కౌంటర్… సిద్దిపేటలో కాంగ్రెస్ ఉగ్ర స్వరం

బీజేపీ కుట్రలకు కౌంటర్… సిద్దిపేటలో కాంగ్రెస్ ఉగ్ర స్వరం

📰 Generate e-Paper Clip

సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధిడిసెంబర్18
బీజేపీ నిరంకుశ, ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉగ్ర స్వరం వినిపించింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనల్లో భాగంగా, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూముకుంట ఆంక్షారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆంక్షా రెడ్డి గారు మాట్లాడుతూ“సుప్రీంకోర్టు తీర్పు చూసైనా అమిత్ షా–మోదీ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ఓటు చోరీ రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు” అని తీవ్ర హెచ్చరిక చేశారు.ప్రజల సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని, పదవులు కాదు ప్రజలే ముఖ్యమన్న నినాదంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న నాయకులు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 8000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు.నేషనల్ హెరాల్డ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడంతో బీజేపీ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాశ్రీయని, ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్షాలను అణచివేయాలన్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టేందుకు అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోమార్క సతీష్ కుమార్ (సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి), సూర్య వర్మ, నాయిని నరసింహారెడ్డి, మార్క రాహుల్ గౌడ్, బంక చిరంజీవి, బుచ్చిరెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ గౌడ్, భువనగిరి, సీనియర్ నాయకులు సురేష్, ముదిగొండ నరేష్ రాజు, శ్రీనివాస్, సీనియర్ నాయకురాలు బిజాని ఎల్లమ్మ, పద్మశ్రీ, భవాని, పద్మ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.బీజేపీ ప్రజావ్యతిరేక విధానాల వల్ల రైతులు, పేదలు, నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతున్నారని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతోందని నేతలు స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు, బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ పోరాటంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గార్లకు అండగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిలుస్తున్నాయని ఈ సందర్భంగా ఘనంగా ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.