📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్హెల్మెట్ జీవరక్షకమే… అలక్ష్యం అయితే ప్రాణపాయమే!

హెల్మెట్ జీవరక్షకమే… అలక్ష్యం అయితే ప్రాణపాయమే!

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లాలో పోలీసుల భారీ అవగాహన

డ్రైవ్
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా,డిసెంబర్8
రోడ్లపై చిన్న తప్పిదమే పెద్ద విషాదాలకు దారి తీస్తున్న తరుణంలో, తిరుపతి జిల్లా పోలీసులు హెల్మెట్ వినియోగంపై విస్తృతమైన చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా ఎస్పీ లక్ష్మీ సుబ్బరాయుడు, ఐపీఎస్ ప్రత్యేకఆదేశాలతో ఈ కార్యక్రమాలు గ్రామాలు పట్టణా లన్నింటిలోను వేగంగా కొనసాగుతున్నాయి.ఇటీవల ద్విచక్ర వాహనాల ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటుండటంతో, ప్రాణనష్టం నివారణకు హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో ప్రజలకు వివరిస్తూ అన్ని పోలీసు స్టేషన్ల సిబ్బంది ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకంగా ట్రాఫిక్ వింగ్, బీట్ సిబ్బంది రహదారులపై, సంక్రమణ పాయింట్ల్లో, స్కూల్–కాలేజ్ వద్ద ప్రజలకు హెల్మెట్ ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు.
పోలీసు అధికారులు పేర్కొంటూ“హెల్మెట్ పెట్టుకోవడం జరిమానా భయంతో కాదు… మన ప్రాణ భద్రత కోసమే అనుకోవాలి. ఒక్క తప్పిదం కుటుంబాలను దుఃఖంలో ముంచుతుంది” అని హెచ్చరించారు.జిల్లాలో అమల్లో ఉన్న నియమాల ప్రకారం హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వకూడదన్న నిబంధనను కఠినంగా అమలుపరుస్తున్నారు. చిన్నదూరం అయినా హెల్మెట్ లేకుండా వాహనం నడపకూడదని పోలీసులు మళ్లీమళ్లీ గుర్తుచేస్తున్నారు.అతిగా వేగం, మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలను పూర్తిగా నివారించాలని, రోడ్డు నియ మాలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.ప్రజలకు తిరుపతి జిల్లా పోలీసుల విజ్ఞప్తి:ద్విచక్ర వాహనంపై ఉన్న ప్రతివ్యక్తి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి రోడ్డు నియమాలు ఖచ్చితంగా పాటించాలి చిన్న నిర్లక్ష్యం “ప్రాణం ఒక్కటే… జాగ్రత్త మాత్రం మన చేతుల్లోనే ఉంది”అని పోలీసులు సందేశం ఇస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.