📄 ePaper
Sunday, August 30, 2026
Homeఆంధ్రప్రదేశ్ఘనమైన పొగమంచుతో రోడ్డు ప్రమాదం

ఘనమైన పొగమంచుతో రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip


ఒక గేదె మృతి.. మరో గేదెకు తీవ్ర గాయాలు
మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం//డిసెంబర్13
తిరుపతి జిల్లా ఏర్పేడు మండల పరిధిలో శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏర్పేడు నుంచి వెంకటగిరి వైపు వెళుతున్న రెండు గేదెలను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక గేదె అక్కడికక్కడే మృతి చెందగా, మరో గేదెకు తీవ్ర గాయాలు కావడంతో రోడ్డుపై కదలలేని స్థితిలో పడివుంది.
తెల్లవారు జామున ఘనమైన పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అదే సమయంలో అటువైపు వెళుతున్న ఓ ద్విచక్ర వాహనదారుడుగేదెలనుగమనించక ఢీకొనడంతోపరిస్థితి మరింత తీవ్రతరమైంది.ద్విచక్ర వాహన దారుడు ఇచ్చిన సమాచారంతో సంఘటనాస్థలానికిచేరుకున్నఏర్పేడుపోలీసులు,గేదెలు ఎవరివి? ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.