📄 ePaper
Tuesday, September 1, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుబీఆర్‌ఎస్‌కు షాక్… కాంగ్రెస్ బలోపేతం

బీఆర్‌ఎస్‌కు షాక్… కాంగ్రెస్ బలోపేతం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లడిసెంబర్ 17
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపెళ్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీలో రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ బీఆర్‌ఎస్ సీనియర్ సభ్యురాలు, మాజీ కోఆప్షన్ సభ్యురాలు, ప్రస్తుతం 4వ వార్డు మెంబర్‌గా కొనసాగుతున్న గౌడ లక్ష్మి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరడం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.డీసీసీ జిల్లా అధ్యక్షులు సంగితం శ్రీనివాస్ సమక్షంలో గౌడ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అధికారికంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు దగ్గరగా పనిచేసే విధానాలు తనను ఆకర్షించాయని ఆమె తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీనే నమ్మకమైన వేదికగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.గౌడ లక్ష్మి పార్టీలో చేరడంతో ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గ్రామ స్థాయిలో మంచి పట్టున్న నాయకురాలి చేరికతో రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు ప్రజా మద్దతు మరింత పెరుగుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గౌడ లక్ష్మికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ విజయాల కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.