📄 ePaper
Monday, August 31, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసిరిసిల్ల నుంచి శబరిమళ మహాపాదయాత్ర దిగ్విజయంగా పూర్తిచేసుకున్న అయిలేనిశంకర్ రావుగురుస్వామీ

సిరిసిల్ల నుంచి శబరిమళ మహాపాదయాత్ర దిగ్విజయంగా పూర్తిచేసుకున్న అయిలేనిశంకర్ రావుగురుస్వామీ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లడిసెంబర్17
దైవ స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ రాచవిద్యాసాగర్ గురుస్వామివారి ఆశీస్సులతో కొలనూరు గ్రామానికి చెందిన అయిలేని శంకర్ రావు గురుస్వామి అక్టోబర్ 26న సిరిసిల్ల నుండి శబరిమళ వరకు మహాపాదయాత్రను ప్రారంభించి, భక్తిశ్రద్ధలతో దిగ్విజయంగా పూర్తి చేశారు. శబరిమళలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని, ఈరోజు స్వగ్రామానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.కొలనూరు ధర్మశాస్త్ర సన్నిధానం తాళ్లపల్లి సతీష్ గౌడ్ గురుస్వామి, చంద్రంపేట మణికంఠ సన్నిధానం ప్రేమ్ సాగర్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో శంకర్ రావు గురుస్వామిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గురుస్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ సన్నిధానాలకు చెందిన గురుస్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొని మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తికావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. శంకర్ రావు గురుస్వామి ఆధ్యాత్మిక దీక్ష, భక్తి నిబద్ధత పలువురికి ఆదర్శంగా నిలిచిందని భక్తులు కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.