📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్శ్రీకాళహస్తి రాజకీయ చరిత్రలో మరపురాని ఘట్టం-చెంచయ్య నాయుడు ప్రమాణస్వీకారం.

శ్రీకాళహస్తి రాజకీయ చరిత్రలో మరపురాని ఘట్టం-చెంచయ్య నాయుడు ప్రమాణస్వీకారం.

📰 Generate e-Paper Clip

నాలుగు వీధుల్లో సాగిన మహా ర్యాలీ.
పూల వర్షం, డప్పుల మోతతో ఉత్సవ వాతావరణం
రైతుల సేవకు కట్టుబడి ఉంటానని హామీ
కనుల పండుగగా రంగినేని చెంచయ్య నాయుడు ప్రమాణస్వీకారం
వేలాదిగా తరలివచ్చిన ప్రజలు.
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.డిసెంబర్13
శ్రీకాళహస్తిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రంగినేని చెంచయ్య నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా, కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా జరిగింది. అతిరథ–మహారథుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం శ్రీకాళహస్తి నియోజకవర్గ చరిత్రలో ఒక మరపురాని ఘట్టంగా నిలిచింది.ప్రమాణస్వీకార వేడుక సాంప్రదాయ నృత్యాలు, కళాకారుల ప్రదర్శనలు, డప్పులు, డీజే సౌండ్స్ మధ్య ఉత్సాహంగా ప్రారంభమైంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం ఒకే చోటుకు కదిలి వచ్చినట్టుగా వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి జనసంద్రంగా మారారు. చిన్నా–పెద్దా తేడా లేకుండా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రంగినేని చెంచయ్య నాయుడిని ఆశీర్వదించారు.
బొజ్జల కుటుంబంపై ఉన్న అపారమైన ప్రేమ, రంగినేని చెంచయ్య నాయుడు పట్ల ఉన్న అభిమానమే ఈ మహాజన ప్రవాహానికి కారణమని పలువురు వ్యాఖ్యానించారు. నాలుగు వీధుల్లో సాగిన ర్యాలీ పూల వర్షంతో మరింత శోభాయమానంగా కనిపించింది. అడుగడుగునా పూలతో స్వాగతం పలుకుతూ మహిళలు హారతులు ఇచ్చారు.సాంప్రదాయ కళాకారుల నృత్యాలు, డప్పుల మోతలతో ప్రారంభమైన ఈ మహోత్సవ ర్యాలీ నాలుగు వీధుల గుండా సాగుతూ మార్కెట్ యార్డు వరకు అంగరంగ వైభవంగా కొనసాగింది. “నాలుగు వీధుల్లో శ్రీకాళహస్తి మొత్తం కదిలి వచ్చిందా?” అనేలా జనసంద్రం కనిపించింది.ఈ సందర్భంగా రంగినేని చెంచయ్య నాయుడు మాట్లాడుతూ,“గతంలో నేను చైర్మన్‌గా పనిచేసిన సమయంలో అనేక మంచి పనులు చేశాను. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో చేసిన సేవలకు మించి, ఇప్పుడు మళ్లీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పదింతలు కష్టపడి పని చేస్తాను. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి విధేయుడిగా రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటాను. గిట్టుబాటు ధరల నుంచి యూరియా వరకు ఏ సమస్య వచ్చినా దగ్గరుండి పరిశీలించి రైతులకు న్యాయం చేస్తాను. గతంలో చేసిన మంచి కంటే పదింతలు మంచి చేసి చూపిస్తాను” అని హామీ ఇచ్చారు.ర్యాలీ సందర్భంగా నాలుగు వీధుల్లోని ప్రజలను పలకరిస్తూ రంగినేని చెంచయ్య నాయుడు, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మమేకమయ్యారు. ప్రజల అభివాదాలు, ఆశీర్వాదాల మధ్య ప్రమాణస్వీకార మహోత్సవం ఉత్సాహంగా కొనసాగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి సవితమ్మ, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, మురళీమోహన్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, షాప్ చైర్మన్ రావి నాయుడు, బీజేపీ నేత కోలా ఆనంద్ తదితర ప్రముఖ నాయకులు హాజరయ్యారు.మొత్తంగా రంగినేని చెంచయ్య నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమం శ్రీకాళ హస్తిలో ప్రజాభిమానానికి ప్రతీకగా, తెలుగుదేశం పార్టీ శక్తి, ఐక్యతను చాటే ఘన ఘట్టంగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.