📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్వీపీఐ గ్యాలరీలో మెస్సి వీఐపీమ్యాచ్-శ్రీకాళహస్తి యువతకు అరుదైన అనుభవం

వీపీఐ గ్యాలరీలో మెస్సి వీఐపీమ్యాచ్-శ్రీకాళహస్తి యువతకు అరుదైన అనుభవం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిది//శ్రీకాళహస్తి నియోజకవర్గం.సెంబర్14
గోట్ ఇండియా టూర్‌కు శ్రీకాళహస్తి యువ క్రీడాకారులు.ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి
గోట్ ఇండియా టూర్ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ మ్యాచ్‌కు శ్రీకాళహస్తి నుంచి యువ క్రీడాకారులను పంపిస్తానని ఇచ్చిన మాటను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి నిలబెట్టుకున్నారు. తన స్వంత నిధులతో యువ క్రీడాకారులను హైదరాబాద్‌కు పంపించి, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.హైదరాబాద్‌లోని స్టేడియంలో నిర్వహించిన ఈ మ్యాచ్‌ను శ్రీకాళహస్తి యువ క్రీడాకారులు ప్రత్యేక వీఐపీ గ్యాలరీలో కూర్చొని ప్రత్యక్షంగా తిలకించారు. ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ఆటను దగ్గర నుంచి వీక్షించే అరుదైన అవకాశాన్ని పొందిన యువత ఆనందోత్సాహాలతో మునిగిపోయారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు—బొజ్జల సుధీర్ రెడ్డి, అక్క పద్మ, వారి పిల్లలు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు బయలుదేరిన శ్రీకాళహస్తి యువ క్రీడాకారులు, బాలికలకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి తన స్వగృహంలో స్వంత బిడ్డల వలే ఆతిథ్యం అందించారు. బాలికలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి క్షణం జాగ్రత్తలు తీసుకుంటూ వారి భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు.
ఫుట్‌బాల్‌పై ఆసక్తి ఉన్న యువతకు ప్రపంచ స్థాయి ఆటను ప్రత్యక్షంగా చూపించి, క్రీడలపై ఉన్న మక్కువను మరింత పెంపొందించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రయత్నం సఫలమైంది. యువతలో క్రీడాస్ఫూర్తిని నింపేలా చేసిన ఈ కార్యక్రమం భవిష్యత్తు లోమంచి క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న ఆశయానికి నిదర్శనంగా నిలిచింది.ఈ సందర్భంగా యువ క్రీడాకారులు మాట్లాడుతూ, “ప్రత్యక్షంగా మెస్సి ఆటను చూడటం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప అవకాశం మాకు కల్పించిన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు, అలాగే మా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు. బయలుదేరిన క్షణం నుంచి తిరిగి చేరేవరకు తమ యోగక్షేమాలను నిరంతరం తెలుసుకుంటూ, సొంత బిడ్డల వలే చూసుకున్నారని యువ క్రీడాకారులు ప్రశంసించారు. “ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూడటం మా భవిష్యత్తుకు ప్రేరణగా నిలుస్తుంది” అంటూ వారు ఆనందం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.