📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుశాంతినికేతన్ విద్యాలయానికి ‘ఈటీ టెక్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డుగర్వకారణం

శాంతినికేతన్ విద్యాలయానికి ‘ఈటీ టెక్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డుగర్వకారణం

📰 Generate e-Paper Clip

కరస్పాండెంట్ మాలి పటేల్ ప్రభు. సంగారెడ్డి జిల్లా.డిసెంబర్ 13 మనప్రజాప్రతినిధి//
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన శాంతినికేతన్ విద్యాలయంకు ప్రతిష్టాత్మకమైన ‘ఈటీ టెక్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు’ లభించడం ఎంతో ఆనందకరమైన విషయమని పాఠశాల కరస్పాండెంట్ మాలి పటేల్ ప్రభు తెలిపారు.శనివారం రోజున హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ హాల్ నెంబర్–4లో ట్రస్మ ఆధ్వర్యంలో, కీర్తిశేషులు జి. పుల్లారెడ్డి గారి స్కూల్ ఫస్ట్ ఈటీటెక్ సంస్థ సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును శాంతినికేతన్ విద్యాల యానికి ప్రదానం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా బడ్జెట్ పాఠశాలల కరస్పాండెంట్లకు ప్రోత్సాహం అందిస్తూ, ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్న వారిని గుర్తించి గౌరవిస్తున్న స్కూల్ ఫస్ట్ సంస్థ సేవలు అభినందనీయమని మాలి పటేల్ ప్రభు పేర్కొన్నారు. ఈ సంస్థకు బడ్జెట్ పాఠశాలల కరస్పాండెంట్లందరూ రుణపడి ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ విద్యాలయ కరస్పాండెంట్ మాలి పటేల్ ప్రభు, ప్రిన్సిపాల్ అరవింద్ శ్రీతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 300 మంది పాఠశాల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.