📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకోలనూర్ గ్రామ పంచాయతీఆవరణలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

కోలనూర్ గ్రామ పంచాయతీఆవరణలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 25
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కోలనూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జలగం అరవిందరావు, ఉప సర్పంచ్ బిట్ల బాబు, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.ఈ సందర్భంగా పాస్టర్ కొర్నిలే, నిరంజన్ రావు, క్రైస్తవ సంఘ పెద్దలు, గ్రామ సోదరసోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నపిల్లలు, మహిళల సమక్షంలో సర్పంచ్‌తో పాటు ప్రజా ప్రతినిధులు క్రిస్మస్ కేక్ కట్ చేసి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.క్యాలెండర్ ఆవిష్కరణరాబోయే నూతన సంవత్సరం 2026కు సంబంధించిన క్యాలెండర్‌ను ప్రజా ప్రతినిధులు, గ్రామ ముఖ్య నాయకులు కలిసి ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక చిత్రాలతో రూపొందించిన ఈ క్యాలెండర్‌ను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామంలో ప్రజలందరూ సోదరభావంతో మెలగాలని, క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, ఆనందం, వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామస్తులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.