📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుపంచాయితీఎన్నికల్లోకాంగ్రెస్ ప్రభంజనం

పంచాయితీఎన్నికల్లోకాంగ్రెస్ ప్రభంజనం

📰 Generate e-Paper Clip

ప్రతిపల్లెఅభివృద్ధికిశ్రీపొన్నంప్రభాకర్ కృషేకారణం
హుస్నాబాద్‌లో80శతానికిపైగావిజయం-ప్రభుత్వ పని తీరుకు ప్రజల తీర్పు
హుస్నాబాద్,డిసెంబర్17(మనప్రజాప్రతినిధి):
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి పల్లెలో అభివృద్ధి జరిగిందంటే, జరుగుతుందంటే అది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ పొన్నం ప్రభాకర్గారిపట్టుదల,నిరంతర కృషి ఫలితమేనని ఆయన స్పష్టం చేశారు.గ్రామస్థాయి పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించిన హుస్నాబాద్ నియోజక వర్గ ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “మీ బలమే నాకు శక్తి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాను” అని మంత్రి అన్నారు.ఎంపీటీసీ,జడ్పీటీసీఎన్నికలపై పిలుపురానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు.ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఓటరు ఈ బాధ్యతను స్వీకరించాలని కోరారు.ప్రభుత్వ పనితీరుకు ప్రజలే సర్టిఫికెట్పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఫలితాలు సీఎంరేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనకు, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పొన్నం ప్రభాకర్ తెలిపారు.హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ, నియోజకవర్గంలో 80 శాతానికి పైగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం కార్యకర్తల కష్టానికి నిదర్శనం అని అన్నారు.కార్యకర్తల కష్టాన్ని వృథా చేయకుండా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రజాపాలనపై నమ్మకానికి స్పష్టమైన సంకేతంపంచాయితీ ఎన్నికల విజయం గ్రామీణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పుకు సంకేతమని మంత్రి పేర్కొన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలకు చేరడం వల్లే ఈ సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారుదళితులు,గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, రైతులు ఏకపక్షంగా కాంగ్రెస్ వైపేనిలిచార ని,సామాజిక న్యాయం అనే నినాదానికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు.బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శస్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పని అయిపోయిందంటూ దుష్ప్రచారంచేస్తున్నారనిపొన్నంప్రభాకర్ విమర్శించారు.చిల్లర రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్‌కు ప్రజలు ఇప్పటికే తగినగుణపాఠం చెప్పారని, రానున్న రోజుల్లో ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని వ్యాఖ్యానించారు.నూతన ప్రజాప్రతినిధులకు సూచనలునూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు గొప్పలకు పోకుండా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలని మంత్రి సూచించారు.ప్రతి ఒక్కరినీ కలుపుకుని గ్రామాలను అభివృద్ధి చేయాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తే నాయకుడు కాలేడని హెచ్చరించారు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వీటిపై నిత్యం సమీక్షలు చేయాలని సూచించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.అన్ని గ్రామాలకు సమాన అభివృద్ధి హామీ
హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తామని, రెండు విడతల పంచాయితీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిందని తెలిపారు.80 శాతానికి పైగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం ప్రజల విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం అని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.