📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్ఘనంగాఏపీసీసీఅధ్యక్షురాలువైఎస్ షర్మిలారెడ్డిజన్మదినవేడుకలు

ఘనంగాఏపీసీసీఅధ్యక్షురాలువైఎస్ షర్మిలారెడ్డిజన్మదినవేడుకలు

📰 Generate e-Paper Clip

తలపాదామోదరంరెడ్డిఆధ్వర్యంలోకేక్ కట్ చేసిస్వీట్స్ పంపిణీ
మనప్రజాప్రతినిది//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్16 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకాంగ్రెస్ పార్టీ శ్రేణులుఘనంగా నిర్వహించారు.శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచుకుంటూ వేడుకలు ఉత్సాహంగా జరిపారు.
ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ,వైఎస్ షర్మిలా రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తిరిగి సాధిస్తోందని అన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ, ప్రజల మధ్యే ఉంటూ, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం, ధైర్యాన్ని నింపుతున్న గొప్ప నాయకురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అని కొనియాడారు.మాట ఇస్తే తప్పని కుటుంబం వైఎస్ కుటుంబమని, పోరాటాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న నాయకురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలోశ్రీకాళహస్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులుసురేంద్ర రెడ్డి, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆంటోనీ,మునికృష్ణయ్య, మహేష్, అరవింద్,నాగరాజు, అరుణ్, చరణ్, మునిరాజ, ప్రవీణ్,గురుసాయి,తరుణ్,అతిథి, సంజయ్, రామ,విజయ్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.