📄 ePaper
Tuesday, September 1, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుచీకటిలో కౌంటింగ్-ప్రజాస్వామ్య హత్య?

చీకటిలో కౌంటింగ్-ప్రజాస్వామ్య హత్య?

📰 Generate e-Paper Clip

సర్పంచ్ ఫలితాన్ని మార్చారని ఆరోపణలు, కలెక్టర్‌కు ఫిర్యాదు
మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట్,భూంపల్లిమండల్,సిద్దిపేటజిల్లా
డిసెంబర్ 14-12-2025
అక్బర్ పేట్–భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డి పల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ సమయంలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
చివరి రౌండ్ కౌంటింగ్ సమయంలో కౌంటింగ్ హాల్‌లో ఉద్దేశపూర్వకంగా కరెంట్ నిలిపివేసి, మాజీ ఎంపీటీసీ బాల మల్లేశం గౌడు అనుకూలంగా ఫలితాన్ని మార్చారని సర్పంచ్ అభ్యర్థి ఈరమైన నడిపి నర్సిములు ఆరోపించారు.
తనను 30 ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు ప్రకటించి, కౌంటింగ్ హాల్ నుంచి బయటకు పంపించారని ఆయన తెలిపారు.అంతేకాకుండా, ఏ ఒక్క సర్పంచ్ అభ్యర్థి సంతకాలు లేకుండా ఎన్నికల అధికారులు ఫలితాన్ని ప్రకటించడం ఎన్నికల నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని నర్సిములు తెలిపారు.ఈ ఘటనపై, ఈరమైన నడిపి నర్సిములు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసి, అక్రమాలపై తక్షణ విచారణ చేపట్టి కౌంటింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.