📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలిగా డా. పనబాక లక్ష్మీ బాధ్యతల స్వీకరణ

టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలిగా డా. పనబాక లక్ష్మీ బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్29
తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలిగా డాక్టర్ పనబాక లక్ష్మీ బాధ్యతలు స్వీకరించారు. రేణిగుంట రోడ్డులోని తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ టిటిడి ఎక్స్-ఆఫిషియో బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పనబాక లక్ష్మీకి ఆయన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని బూత్ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు మరింత బలోపేతం చేయడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.పార్టీ క్రమశిక్షణ, ఐక్యత, ప్రజాసేవే తెలుగు దేశం పార్టీ బలమని పేర్కొంటూ, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాల ను ప్రజల మధ్యకు మరింత బలంగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.