📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలున్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి

న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి

📰 Generate e-Paper Clip

డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ “మహేష్ బి. గితే, ఐపీఎస్
మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్ 29
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, ఐపీఎస్ గారు సూచించారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో ప్రజా భద్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు, అధిక శబ్దం వచ్చే సౌండ్ బాక్స్‌లు ఏర్పాటు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు.
పోలీసుల సూచనలు :
డిసెంబర్ 31న టపాసులు, మైకులు వినియోగించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డీజేలు పూర్తిగా నిషేధం. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తే డీజేలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం.మద్యం మత్తులో వాహనాలు నడపడం, రాష్ డ్రైవింగ్, సైలెన్సర్ తొలగించి శబ్ద కాలుష్యం సృష్టించడం, ట్రిపుల్ రైడింగ్ వంటి చర్యలకు పాల్పడితే కేసులతో పాటు జైలు శిక్ష విధించబడుతుంది.ఇళ్లు, ప్రైవేట్ ఆస్తులు, వీధి దీపాలపై రాళ్లు వేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, మహిళలను ఇబ్బంది పెట్టడం లేదా అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తాం.మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తాం. వారి వల్ల ప్రమాదం జరిగితే సంరక్షకులపై కూడా చర్యలు తీసుకుంటాం.నిబంధనల ఉల్లంఘనలను ప్రజలు వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.ప్రజలు, యువత నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుతంగా ఆనందోత్సా హాల మధ్య జరుపుకోవాలని సూచించారు.2026 సంవత్సరం జిల్లా ప్రజలందరికీ శుభఫలితాలు అందించాలని కోరుకుంటూ, పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.