📄 ePaper
Monday, August 31, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుధర్మారంలోఎన్నికలఅవగాహనకార్యక్రమం

ధర్మారంలోఎన్నికలఅవగాహనకార్యక్రమం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 05
కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అవగాహన కార్యక్రమాన్ని కోనరావుపేట ఎస్‌ఐ కె. ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ప్రతి ఓటరు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలు అనుసరించాల్సిన ప్రవర్తనా విధానం, శాంతి-భద్రత పరిరక్షణలో పోలీసు శాఖ పాత్రను వివరించారు.ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలంతా పోలీసులకు సహకరించాలని, ఎలాంటి గొడవలు లేదా పార్టీ తగాదాల్లో పాల్గొని ఇబ్బందులు పడవద్దని హెచ్చరించారు. శాంతి భద్రతలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.