📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఎన్నికలసిద్ధతపైఫోకస్ – డిస్ట్రిబ్యూషన్ సెంటర్లనుసమగ్రంగాపరిశీలించినఅదనపుకలెక్టర్ గడ్డం నగేష్

ఎన్నికలసిద్ధతపైఫోకస్ – డిస్ట్రిబ్యూషన్ సెంటర్లనుసమగ్రంగాపరిశీలించినఅదనపుకలెక్టర్ గడ్డం నగేష్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్లడిసెంబర్9
గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు మరింత వేగం అందుకున్నాయి. ఈ క్రమంలో వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్, చందుర్తి మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం స్వయంగా పరిశీలించారు.పోలింగ్ సిబ్బందికి అవసరమైన సమగ్ర వసతులు, స్ట్రాంగ్ రూమ్ భద్రత, మౌలిక సదుపాయాలు, క్రమబద్ధీకరించిన పంపిణీ విధానంపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. “ఎన్నికలు ఎటువంటి ఇబ్బందులూ, లోపాలూలేకుండా నిర్వ హించాలి. ప్రతి పోలింగ్ సిబ్బంది సౌకర్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి” అని నగేష్ స్పష్టం చేశారు.పరిశీలనలో తహసీల్దార్లు విజయ్ ప్రకాశ్ రావు, అబూ బాకర్, భూపతి, ఎంపీడీఓలు శ్రీనివాస్, కీర్తన తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.