📄 ePaper
Thursday, October 15, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఅనారోగ్యం – ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

అనారోగ్యం – ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్9
నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన దిటి రజిత (33) అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, భర్త మృతి వేదనతో ఈరోజు ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన చోటుచేసుకుంది.
కుటుంబ పరిస్థితే ఇలా:రజితకు 14 సంవత్సరాల క్రితం సంతోష్‌తో వివాహం జరిగింది.ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.భర్త సంతోష్ మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆమె తీవ్ర మానసిక వేదనలోకి వెళ్లింది.భర్త మృతి తర్వాత ఆరోగ్యం కూడా క్షీణించడంతో పాటు ఆర్థిక సమస్యలు మరింత పెరిగాయి.సంఘటన ఇలా జరిగింది:వారం క్రితం రజిత తన తల్లి ఇల్లు నేరెళ్ల గ్రామానికి వచ్చింది.ఈరోజు ఉదయం 7 గంటలకు తలనొప్పిగా ఉందని చెప్పి గదిలోకి వెళ్లి తలుపు మూసుకుంది. కొంతసేపటి తర్వాత బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లారు.గదిలోని ఇనుపరాడుకు చున్ని సహాయంతో ఉరివేసుకుని మృతిగా కనిపించింది.పోలీసుల ప్రకటన:మృతురాలి తండ్రి పల్లె అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగాఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.మృతురాలి మరణంపై కుటుంబానికి ఎటువంటి అనుమానం లేదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.