📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలునగరం గ్రామ అభివృద్ధికి కటికే లక్ష్మీ అశోక్–చెరుకు శ్రీనివాస్ రెడ్డి హామీ

నగరం గ్రామ అభివృద్ధికి కటికే లక్ష్మీ అశోక్–చెరుకు శ్రీనివాస్ రెడ్డి హామీ

📰 Generate e-Paper Clip

ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తాం : నాగరం గ్రామ సందర్శనలో స్పష్టం
మనప్రజాప్రతినిధి//అక్బర్పేటభూంపల్లిమండల్,సిద్దిపేటజిల్లాడిసెంబర్ 11 అక్బర్పేటభూంపల్లి మండల పరిధిలోని నగరం గ్రామంలో శనివారం గ్రామ పర్యటనలో పాల్గొన్న మండల ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతానని స్పష్టం చేశారు. సర్పంచ్ అభ్యర్థి కటికే లక్ష్మీ అశోక్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు.సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి,“నగరం గ్రామం కోసం ప్రకటించిన అభివృద్ధి కార్యాచ రణను పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. ప్రజల నమ్మకమే మా బలం” అని పేర్కొన్నారు.నాగరం గ్రామం కోసం ప్రకటించిన 12 కీలక హామీలుసర్పంచ్ అభ్యర్థి కటికే లక్ష్మీ అశోక్ – ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
నూతన పాఠశాల భవనం నిర్మాణం
● పారదర్శక సుపరిపాలన – ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో
● ప్రతి నెల గ్రామసభ – ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం
● నల్లాబిల్లుల మాఫీ
● పిల్లలకు ఉచిత నోట్‌బుక్‌ల పంపిణీ
● గ్రామంలో మరణించిన కుటుంబాలకు ₹2,000 ఆర్థిక సాయం
● నిరుపేద పెళ్లిళ్లకు ₹5,000 సహాయం
● గ్రామపంచాయతీ కార్యాలయం ఏర్పాటు
● దేవాలయాల అభివృద్ధి చర్యలు
● రైతు సంక్షేమ కమిటీ – ప్రతి నెలా సమావేశాలు
● నూతన పంటలు, వంగడాల వినియోగంపై అవగాహన సదస్సులు
● లైబ్రరీ భవనం నిర్మాణం
● ప్రతి మూడు నెలలకు వైద్య శిబిరం – ఉచిత మందుల పంపిణీ
● ప్లాస్టిక్ రహిత గ్రామం – పారిశుద్ధ్య చర్యలు
● మౌలిక వసతుల అభివృద్ధి – రోడ్ల మరమ్మతులు
● చదువులో ప్రతిభ చూపే విద్యార్థులకు చేయూత
“నగరం గ్రామం అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి ముందుకు సాగుతాం. చెప్పిన ప్రతి హామీ అమలే మా లక్ష్యం” అని కటికే లక్ష్మీ అశోక్ వెల్లడించారు.కార్యక్రమంలో పాల్గొన్నారు:రాములు, స్వామి, భూపాల్, దేవయ్య, రాజు, కాముని బిక్షపతి, లింగాపురం చంద్రయ్యతో పాటు గ్రామంలోని సీనియర్ నాయకులు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.