📄 ePaper
Tuesday, September 1, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలుకొలనూరులో కాంగ్రెస్ జెండా ఎగిరింది.

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలుకొలనూరులో కాంగ్రెస్ జెండా ఎగిరింది.

📰 Generate e-Paper Clip

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వానికి పెరుగుతున్న ఆదరణ
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్23
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ బలం చేకూరింది. వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్, బీఎస్పీ గ్రామ శాఖ అధ్యక్షుడు మెరుగు వెంకటేశం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మెరుగు దేవయ్య, ప్రశాంత్, వార్డు సభ్యులు పల్లె పరమేశ్వర్, ఎర్ర కావ్యలు, రామన్నపేట గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులతో పాటు సుమారు 100 మందికి పైగా కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నూతన వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలం. నూతన పాలకవర్గం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి. వారి ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి నా పూర్తి సహకారం ఉంటుంది” అని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని, అందుకే పెద్ద సంఖ్యలో నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.