📄 ePaper
Monday, August 31, 2026
Homeతెలంగాణశ్రీవాణి స్కూల్ లో ముందస్తుగా మిమిక్రీ డే వేడుకలు

శ్రీవాణి స్కూల్ లో ముందస్తుగా మిమిక్రీ డే వేడుకలు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సిద్ధిపేట,27:

సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని శ్రీవాణి స్కూల్లో ఘనంగా మిమిక్రీ మరియు వెంట్రిలాక్విజం ప్రదర్శనలు నిర్వహించారు . ప్రముఖ మిమిక్రీ , వెంట్రిలాక్విజం  కళాకారుడు వై.రమేష్ ,తమ అనుకరణ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కార్యక్రమాన్ని మరింత రసవత్తరంగా మార్చారు. ప్రసిద్ధ కళాకారుల కంఠస్వరాలను, జంతువుల శబ్దాలను అద్భుతంగా అనుకరిస్తూ అందరినీ అలరించారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్  సత్యం మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసి, ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఈ కార్య‌క్ర‌మం నిలిచిందని తెలిపారు.అనంతరం పాఠశాల    డైరెక్టర్ సి.హెచ్ సత్యం  వై.రమేష్ ను శాలువా కప్పి , మెమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.