📄 ePaper
Monday, August 31, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలు21న సిద్దిపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు

21న సిద్దిపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర మైదానంలో నిర్వహణ
సిద్దిపేట,డిసెంబర్19(మనప్రజాప్రతినిధి):
సిద్దిపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ క్రీడాకారులకు గొప్ప అవకాశం లభించింది. ఈ నెల 21వ తేదీన సిద్దిపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ సీనియర్ మెన్ జట్టు ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్లు మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గన్నే భరత్ రెడ్డి తెలిపారు.ఈ ఎంపిక పోటీలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర మైదానంలో జరగనున్నాయి. పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు.అర్హతగా, పాల్గొనే క్రీడాకారులు 85 కిలోల లోపు బరువు కలిగి ఉండాలి. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను సిద్దిపేట జిల్లా జట్టుకు ఎంపిక చేసి, వారు ఈ నెల 26 నుంచి 28 వరకు ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.
•జిల్లా కబడ్డీ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను రాష్ట్రస్థాయిలో చాటాలని గన్నే భరత్ రెడ్డి కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.