📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుజాతీయ లోక్ అదాలత్‌-ప్రజలకు సువర్ణావకాశంరాజీతో సత్వర న్యాయం సాధించండి: సిద్దిపేటపోలీస్ కమిషనర్

జాతీయ లోక్ అదాలత్‌-ప్రజలకు సువర్ణావకాశంరాజీతో సత్వర న్యాయం సాధించండి: సిద్దిపేటపోలీస్ కమిషనర్

📰 Generate e-Paper Clip



మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.డిసెంబర్18
డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ తెలిపారు. చిన్న చిన్న కంపౌండబుల్ కేసుల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమైన అవకాశం అని ఆయన అన్నారు.రాజీ పడదగిన కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబపరమైన వివాదాలు, రోడ్డు ప్రమాదాల కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, టౌన్ న్యూసెన్స్, చెక్ బౌన్స్ తదితర రాజీ సాధ్యమైన కేసుల్లో నిందితులు ఫిర్యాదీదారులు సంబంధిత పోలీస్ స్టేషన్‌ను లేదా న్యాయస్థానాన్ని నేరుగా సంప్రదించి రాజీ పడవచ్చని సూచించారు.చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని, జుడిషియల్ డిపార్ట్మెంట్ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.లోక్ అదాలత్ విజయవంతం కావడానికి పోలీస్ అధికారులు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.