📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుపురుగుల మందు సేవించి వ్యక్తి మృతి కొత్తపల్లి గ్రామంలో విషాదఘటన

పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి కొత్తపల్లి గ్రామంలో విషాదఘటన

📰 Generate e-Paper Clip

పాపన్నపేట.డిసెంబర్18(మనప్రజాప్రతినిధి)
పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో పురుగుల మందు సేవించి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం-గ్రామానికి చెందిన బైకనీ శ్రీనివాస్ (38) ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే కొన్ని నెలల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో కాలు విరగడంతో అప్పటి నుంచి ఇంటివద్దే ఉంటున్నాడు. కాలు విరిగిన కారణంగా పని చేయలేకపోతున్నానని, కుటుంబ భారం పెరిగిందని తరచూ ఆవేదన వ్యక్తం చేస్తూ మనస్తాపానికి గురయ్యేవాడు.ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన శ్రీనివాస్ బుధవారం ఇంటి నుంచి పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు సేవించాడు. తీవ్ర అస్వస్థతకు గురవుతున్న అతడిని గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతుడి భార్య ఎలీషా ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ ఘటన గ్రామంలో విషాదఛాయలను నింపింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.