📄 ePaper
Sunday, August 30, 2026
Homeఆంధ్రప్రదేశ్తిరుమలలో పోలీసుల అప్రమత్తత: తప్పిపోయిన బాలుడికి సురక్షిత ఆశ్రయం

తిరుమలలో పోలీసుల అప్రమత్తత: తప్పిపోయిన బాలుడికి సురక్షిత ఆశ్రయం

📰 Generate e-Paper Clip

వైకుంఠ ఏకాదశి రద్దీలోనూ విజయవంతమైన రక్షణ చర్య

మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్29
తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమలు చేస్తున్న జియో ట్యాగ్ విధానం ద్వారా తప్పిపోయిన ఓ బాలుడిని తిరుపతి జిల్లా పోలీసులు సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో, చిన్నపిల్లలు మరియు వృద్ధులు తప్పిపోకుండా ఉండేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జియో ట్యాగ్ విధానాన్ని అమలు చేయడంతో పాటు, ప్రత్యేక అధికారులు, మహిళా పోలీసు సిబ్బందిని నియమించారు.ఈ క్రమంలో, ఈరోజు తిరుమలలోని బీడీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద దర్శనార్థం వచ్చిన కౌశిక్ (వయస్సు5 సంవత్సరాలు) అనే బాలుడు తప్పిపోయినట్లు అతని తండ్రి వెంకటేష్ (పెర్ణంబట్టు, తమిళనాడు రాష్ట్రం) పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి, బాలుడికి ముందుగా కట్టిన జియో ట్యాగ్ ఆధారంగా అతని స్థానాన్ని గుర్తించి, ఎలాంటి అపాయం జరగకుండా సురక్షితంగా బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు పోలీసుల పనితీరుపై మిక్కిలి సంతోషం వ్యక్తం చేస్తూ, తిరుపతి జిల్లా పోలీస్ శాఖను హృదయపూర్వకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.