📄 ePaper
Friday, October 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుబీఆర్ఎస్ జిల్లా నాయకుడు ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా రంగి కృష్ణకు ఘన సన్మానం

బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా రంగి కృష్ణకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నర్సాపూర్.డిసెంబర్29
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన రంగి కృష్ణను బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ప్రతాప్ రెడ్డి ఘనంగా సన్మానించారు.జలాల్పూర్ గ్రామం నుంచి వరుసగా రెండు పర్యాయా లు సర్పంచ్‌గా గెలుపొందిన యువ నాయకుడు రంగి కృష్ణ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవాభావంతో పనిచేస్తున్నారని ప్రతాప్ రెడ్డి ప్రశంసించారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు సర్పంచ్‌గా కాకుండా సేవకునిగా పనిచేయాలనే ఆయన సంకల్పం అభినందనీయమని అన్నారు.అతి చిన్న వయసులోనే వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గర్వకారణ మని పేర్కొంటూ, భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి రంగి కృష్ణ మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రంగి కృష్ణకు ప్రతాప్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.