📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్బృందావనం రూఫ్‌టాప్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనవిజయం

బృందావనం రూఫ్‌టాప్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనవిజయం

📰 Generate e-Paper Clip

ప్రారంభించిన కాంగ్రెస్ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్ 15
శ్రీకాళహస్తి పట్టణానికి అతి సమీపంలో, జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటైన బృందావనం (రూఫ్‌టాప్) రెస్టారెంట్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ప్రత్యేక పూజలతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి ప్రాంతంలో ఆధునిక వసతులు, విశాలమైన రూఫ్‌టాప్ సౌకర్యాలతో ఇలాంటి రెస్టారెంట్ ప్రారంభం కావడం పట్టణ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ సంస్థ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తి పట్టణం మరింత అభివృద్ధి చెందేందుకు ఇలాంటి వ్యాపారాలు దోహదపడతా యని పేర్కొన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేశారు. రెస్టారెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వ్యాపారం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.