📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకొమురవెల్లి మల్లన్న కళ్యాణం ఘనంగా ఘటించబడింది

కొమురవెల్లి మల్లన్న కళ్యాణం ఘనంగా ఘటించబడింది

📰 Generate e-Paper Clip

వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం స్వామి వివాహం; 50,000 మంది భక్తులు హాజరు
మనప్రజాప్రతినిధి//కొమురవెల్లి,జనగామనియోజకవర్గం:డిసెంబర్ 14తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో ఈ వారంలో ఘనంగా మల్లన్న కళ్యాణం జరిగింది. ఉదయం 10:45 గంటలకు, వీరశైవ అర్చకుల వేదమంత్రాల మధ్య, వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లికార్జున స్వామి బలిజమేడలమ్మ, గోళ్లకేతమ్మలను వివాహమాడా రు.రాష్ట్ర ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. ఈ ఘన కార్యక్రమాన్ని వీరశైవ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 మహామండలేశ్వర్ డాక్టర్ మహంతీ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వాహించగా, ఆలయ అర్చకులు, అధికారులుపూర్తిపర్యవేక్షణలో పాల్గొన్నారు.కల్యాణంలో వరుడు మల్లికార్జున స్వామి తరుపున కన్యా గ్రహితులుగా పడిగన్నగారి వంశస్థులు, కన్యాదాతలుగా మేడలమ్మ, కేతమ్మ అమ్మవార్ల వంశస్థులు పాల్గొన్నారు. అనంతరం దేవతా మూర్తులకు పట్టు వస్త్రాలు, పూలమాలలు ధరించి సుందరంగా అలంకరించారు.సుమారు 50,000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని, మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలను మార్మోగించే శారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 340 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.