📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసదాశివపేట మండల కురుమ సర్పంచులు, వార్డు సభ్యులకు ఘన సత్కారం

సదాశివపేట మండల కురుమ సర్పంచులు, వార్డు సభ్యులకు ఘన సత్కారం

📰 Generate e-Paper Clip

సదాశివపేట,డిసెంబర్28(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట మండల కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వెల్టూరు గ్రామ శివారులోని పద్మావతి గార్డెన్‌లో నూతనంగా ఎన్నికైన కురుమ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు గూడెం మల్లయ్య, మండల కురుమ సంఘం అధ్యక్షులు శివలింగ నరసింహులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సదాశివపేట మండలంలో అధిక సంఖ్యలో కురుమ సర్పంచులు ఎన్నిక కావడం గర్వకారణమని పేర్కొంటూ, గెలిచిన ప్రతినిధులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా సేవ చేయాలని సూచించారు.అలాగే ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు నిరాశ చెందకుండా ప్రజాసేవ కొనసాగిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. అనంతరం గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు బూరగడ్డ నాగేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ పైతర సాయికుమార్, ఓడిఎఫ్ పాండు, డాక్టర్ శ్రీవారి, శ్రీకాంత్, మాజీ ఎంపీపీ జూలకంటి ఆంజనేయులు, భాగన్న, గడ్డమీద సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ, మాజీ డైరెక్టర్ నాగేష్, సురేష్, కాశీపురం రవి, పెద్ద గొల్ల ఆంజనేయులు, పెద్ద గొల్ల రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.