📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమిలిగిరిపేట గ్రామంలో నూతన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ ప్రమాణ స్వీకారం

మిలిగిరిపేట గ్రామంలో నూతన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

సదాశివపేట,డిసెంబర్‌22(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మిలిగిరిపేట గ్రామంలో సోమవారం నాడు నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ షాబుద్దీన్‌, ఉపసర్పంచ్‌ యాదయ్యతో పాటు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కో-ఆప్షన్‌ సభ్యుడిగా శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ షాబుద్దీన్‌ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా అందరినీ కలుపుకొని గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. సభ్యులు, గ్రామ పెద్దల సహకారంతో మిలిగిరిపేటను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జయప్రకాశ్‌రెడ్డి, సీడీసీ చైర్మన్‌ రామ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సిద్ధన్నలకు సర్పంచ్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భద్రారెడ్డి, రాంరెడ్డి, అంజిరెడ్డి, దానయ్య, ఉషయ్యతో పాటు గ్రామ యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.