📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగణితంతో భవిష్యత్తు నిర్మాణం ముస్లాపూర్ పాఠశాలలో గణిత దినోత్సవం

గణితంతో భవిష్యత్తు నిర్మాణం ముస్లాపూర్ పాఠశాలలో గణిత దినోత్సవం

📰 Generate e-Paper Clip

మెదక్,డిసెంబర్22(మనప్రజాప్రతినిధి):
అల్లాదుర్గ్ మండలం ముస్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్‌ఎం రమేష్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గణితం ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని, చదువులోనే కాకుండా జీవిత నిర్ణయాలలోనూ దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయురాలు రుక్మిణి మాట్లాడుతూ, గణితం మన దైనందిన జీవితంలో అనివార్యమైన శాస్త్రం అని, ఇది తర్కశక్తి, విశ్లేషణా సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తుందని తెలిపారు. గణితాన్ని భయపడకుండా ఆసక్తితో అభ్యసిస్తే భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించవచ్చని విద్యార్థులను ప్రోత్సహించారు.కార్యక్రమంలో విద్యార్థులు గణిత నమూనాలు, సూత్రాల ప్రదర్శనలు, క్విజ్‌లు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు గణిత శాస్త్ర ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దీనా మేడం, జనార్ధన్, ఆంజనేయులు, రుక్మిణి, గురు చరణం, రాజరత్నం, జయమ్మ, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.