📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసూరారం గ్రామంలో నూతన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం

సూరారం గ్రామంలో నూతన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

సదాశివాపేట,డిసెంబర్22(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా సదాశివాపేట మండలం సూరారం గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి విడతగా నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన పాలకవర్గం సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టింది.ఈ ఎన్నికల్లో సర్పంచ్‌గా మొగ్దుం పటేల్‌, ఉప సర్పంచ్‌గా మొహమ్మద్ హైమద్‌తో పాటు వార్డు సభ్యులు ఎన్నికై, గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి శిరీష నూతన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
కార్యక్రమంలో కార్యదర్శి శిరీష మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన పాలకవర్గం నేటి నుంచే తమ విధులను ప్రారంభించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. ముఖ్యంగా ఉప సర్పంచ్‌గా మొహమ్మద్ హైమద్ (చోటి మియా) బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శిరీష, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి నూతన పాలకవర్గం సమిష్టిగా పనిచేయాలని ప్రజలు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.