📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఇర్కోడ్ గ్రామంలో యువత పాలనకు ఘన ఆరంభం "పదివార్డుల్లో ఆరు యువత కైవసం-యువ సర్పంచ్‌తో కొత్త...

ఇర్కోడ్ గ్రామంలో యువత పాలనకు ఘన ఆరంభం “పదివార్డుల్లో ఆరు యువత కైవసం-యువ సర్పంచ్‌తో కొత్త పాలనకు నాంది.

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.డిసెంబర్22
స్థానిక సంస్థల ఎన్నికలు ఇర్కోడ్ గ్రామంలో ప్రజాస్వామ్యానికి నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. గ్రామ అభివృద్ధి దిశగా యువత ముందుకు రావడంతో ప్రజల్లో ఆశలు, ఆకాంక్షలు మరింత బలపడ్డాయి. పది వార్డు సభ్యుల స్థానాలకు గాను ఆరు వార్డులను యువత కైవసం చేసుకోవడం గ్రామ రాజకీయాల్లో యువ విప్లవానికి నిదర్శనంగా నిలిచింది.ముఖ్యంగా ఇర్కోడ్ గ్రామానికి యువకుడైన గణపురం కృష్ణ సర్పంచ్‌గా ఎన్నిక కావడం విశేషంగా మారింది. యువ సర్పంచ్‌తో పాటు యువ వార్డు సభ్యుల విజయంతో గ్రామ పాలన మొత్తం యువశక్తి చేతుల్లోకి రావడం ప్రజల్లో నూతన నమ్మకాన్ని కలిగిస్తోంది.ఈ ఎన్నికల్లో యువత ఘన విజయాలు సాధించారు.4వ వార్డు సభ్యురాలిగా బాలగోని స్రవంతి,
5వ వార్డు సభ్యుడిగా బందారం పర్శరాములు,6వ వార్డు సభ్యుడిగా వాసూరి శేఖర్,7వ వార్డు సభ్యుడిగా గణపురం రమేష్,
8వ వార్డు సభ్యుడిగా కత్తి శ్రీనివాస్ గౌడ్.9వ వార్డు బొర్ర చంద్రశేఖర్.భారీ మెజార్టీతో విజయం సాధించి గ్రామంలో రాజకీయ ప్రభంజనం సృష్టించారు.భావితరాలకు బాటలు వేయాలనే సంకల్పంతో, బంగారు భవిష్యత్తుకు వెలుగులు నింపాలనే ఆశయంతో బరిలోకి దిగిన యువ అభ్యర్థులను గ్రామ ప్రజలు విశ్వాసంతో ఆదరించారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయి.విజయం అనంతరం యువ సర్పంచ్ గణపురం కృష్ణతో పాటు యువ వార్డు సభ్యులు మాట్లాడుతూ, తమపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. మాటలకు పరిమితం కాకుండా పనిలో చూపిస్తామని స్పష్టం చేశారు. డ్రైనేజ్ సమస్యలు, దెబ్బతిన్న రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్యం వంటి మౌలిక అవసరాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని తక్షణమే పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ చారిత్రక విజయాల వెనుక గౌరవ మాజీ సుడా చైర్మన్ శ్రీ మారెడ్డి రవీందర్ రెడ్డి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఎంతో ఉందని యువ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని వెల్లడించారు.ఇర్కోడ్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ యువత విజయం ప్రజాస్వామ్యంలో ఒక కొత్త ఉదయంగా నిలుస్తూ, గ్రామాన్ని మార్చే శక్తి యువత చేతుల్లోనే ఉందని మరోసారి రుజువు చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.