📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఎర్రజెండాతోనే ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం

ఎర్రజెండాతోనే ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం

📰 Generate e-Paper Clip

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల్ నర్సయ్య మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్ 8
కొండపాక మండలంలోని వెలికట్ట గ్రామంలో సోమవారం నిర్వహించిన సిపిఎం కార్యకర్తల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కమిటీ సభ్యులు అమ్ముల బాల్ నర్సయ్య మాట్లాడారు.
బాల్ నర్సయ్య మాట్లాడుతూ“సమాజంలోని ప్రజల మౌలిక సమస్యలకు పరిష్కారం రావాలంటే సిపిఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం తప్ప మరో మార్గం లేదు” అని పిలుపునిచ్చారు.అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ:2004–2005 నాటి కేంద్ర ప్రభుత్వ కాలంలో ఉపాధి హామీ చట్టం (NREGS), సమాచార హక్కు చట్టం (RTI) తీసుకురావడంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు.
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు హామీలు మాత్రమే ఇస్తున్నాయని, అమలులో పూర్తిగా విఫలమవుతున్నాయని వ్యాఖ్యానించారు. కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువజనులు, గిరిజనులు, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నది సిపిఎం ఒక్కటే అని స్పష్టం చేశారు.పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా విధానమే సరైన మార్గం అని అన్నారు.అందుకే గ్రామాల్లో సిపిఎం బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధి సాధించడంలో సిపిఎం ముందుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి సిపిఎం మండల కమిటీ సభ్యులు కనకచారి అధ్యక్షత వహించారు.కార్యక్రమంలో పాల్గొన్నవారు:కొమురవెల్లి కనకయ్య, తటోజు రవీంద్రచారి, జగపతి నాగరాజు, గజంబీకర్ బాలకిషన్, ఎర్రబోయిన చంద్రయ్య, దొమ్మట రొడ్డ బెల్లమయ్య, అమ్ముల పరుశరాములు, పెరుగు యాదయ్య, అమ్ముల కనకయ్య, సీఐటీయూ నాయకులు కొమురయ్య,ప్రభాకర్ తదితరులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.