📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఅల్మస్పూర్ గ్రామంలో ఏకగ్రీవ ఎన్నికసర్పంచ్,వార్డుసభ్యులకుఘనసన్మానం

అల్మస్పూర్ గ్రామంలో ఏకగ్రీవ ఎన్నికసర్పంచ్,వార్డుసభ్యులకుఘనసన్మానం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి మండలం.సిద్దిపేట జిల్లా
అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని అల్మస్పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య గారు నూతనంగా ఎన్నికైన ప్రతినిధులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అల్మాజీపూర్ గ్రామ సర్పంచ్‌గా మీరాపురం పద్మ–మల్లేశం, ఉప సర్పంచ్‌గా చంద్రం, వార్డు సభ్యులుగా దుర్గవ్వ, పద్మ, నరసింహారెడ్డి, కనకయ్య, నర్శింలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular