📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుతాళ్లపల్లిగ్రామంలోప్రజాస్వామ్యపండుగఏకగ్రీవంగాసర్పంచ్,వార్డుసభ్యులఎన్నిక

తాళ్లపల్లిగ్రామంలోప్రజాస్వామ్యపండుగఏకగ్రీవంగాసర్పంచ్,వార్డుసభ్యులఎన్నిక

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేటభూంపల్లిమండలం,సిద్దిపేట జిల్లా
అక్బర్‌పేటభూంపల్లిమండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో జరిగిన ఏకగ్రీవా ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో గ్రామ ప్రజల సంపూర్ణ మద్దతుతో నీల ప్రభాకర్ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని నూతన సర్పంచ్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో ప్రజాస్వామ్య విలువలు ప్రతిబింబించాయి. గ్రామస్తుల సహకారం, ఐకమత్యంతో ఏకగ్రీవాఎన్నిక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పూర్తయ్యాయి. గ్రామ అభివృద్ధికి సంబంధించి రోడ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని నీల ప్రభాకర్ తెలిపారు.అలాగే వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామానికి సేవ చేస్తామని హామీ ఇచ్చారు.ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులు:1వ వార్డు –గొడుగుపల్లి నాగరాజు2వ వార్డు – గడ్డం యాదగిరి3వ వార్డు – బొడోలు అంజయ్య4వ వార్డు – బొమ్మరపు సుకన్య5వ వార్డు – గోదా శృతి6వ వార్డు – మంగమొళ్ల మారుతి7వ వార్డు – పాతూరు నవీన్ గౌడ్8వ వార్డు –వెలుపల సత్తవ్వ నూతన ప్రజాప్రతినిధుల ఎన్నిక సందర్భంగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular