📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురామరాజ్య స్థాపనకు కృషి చేస్తాం-సర్పంచ్ మిద్దె శివకుమార్

రామరాజ్య స్థాపనకు కృషి చేస్తాం-సర్పంచ్ మిద్దె శివకుమార్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్24
మన పర భేదం లేకుండా పరిపాలనలో పారదర్శకత పాటిస్తూ దుద్దెడ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని దుద్దెడ గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్ అన్నారు.దుద్దెడలోని సాయి కృప విద్యాలయంలో లీడ్ లైఫ్ హ్యాపీలీ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన రామాయణం బ్రోచర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వనజ అధ్యక్షతన ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మిద్దె శివకుమార్ మాట్లాడుతూ, రాముని ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలో రామరాజ్య స్థాపనకు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు గ్రామంలో ప్రతి ఏటా సంయుక్త క్రీడా పోటీలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. విద్యాభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టు వడ్లకొండ శ్రీనివాస్, ఉప సర్పంచ్ జానకి యాదగిరి, వార్డు సభ్యులు గుండెల్లి ఆంజనేయులు, గూడెం శంకర్, నవీద్, గున్నాల నరేష్, ఓజయ్య, రొడ్డ ప్రవీణ్, గొడుగు రాజు, కళ్యాణి, యశోదర, నవీన, స్వప్న పాల్గొన్నారు. అలాగే పాఠశాల పేరెంట్ కమిటీ చైర్మన్ ఇరువాల కాంతారావు, వైస్ చైర్మన్ విజయేందర్ రెడ్డి, లీడ్ లైఫ్ హ్యాపీలీ సంస్థ పిఆర్ఓ పంజ రమేష్, కోఆర్డినేటర్ దేవేందర్, నాయకులు అఖిల్, కర్ణాకర్, స్వామి, రాకేష్ తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.