📄 ePaper
Monday, August 31, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలువీరారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

వీరారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

📰 Generate e-Paper Clip

ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండిసర్పంచ్ అభ్యర్థి ఈరబోయిన నడిపి నర్సిములు
మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట్ భూంపల్లి మండలం,దుబ్బాక నియోజకవర్గం,సిద్దిపేట జిల్లాడిసెంబర్11
అక్బర్ పేట్–భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈరబోయిన నడిపి నర్సిములు, గురువారం గ్రామంలో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలతో మమేకమై మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.“పాలకుడిని కాదు… సేవకుడిని. అబద్ధాలు చెప్పను… అభివృద్ధి చేసి చూపిస్తా” అంటూ నర్సిములు ప్రజలను ఉద్దేశించి స్పష్టం చేశారు.“వీరారెడ్డిపల్లి అభివృద్ధి నా మాట కాదు, సంకల్పం” – నర్సిములుఇంటింట ప్రచారంలో మాట్లాడుతూ ఆయన పేర్కొన్న ముఖ్యాంశాలు:
అభివృద్ధి కోసం ఇచ్చిన ప్రధాన హామీలు
● గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం
● అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల పూర్తి ఏర్పాటు
● ప్రభుత్వ స్థలంలో రైతులకు ధాన్యం ఆరబెట్టే యార్డు ఏర్పాటు
● ఇంటి స్థలం లేని నిరుపేదలకు స్థలం + గృహ నిర్మాణం
● గ్రామంలో వైద్యం, విద్య, ఉపాధి అవకాశాల విస్తరణ
● మినీ ఫంక్షన్ హాల్ / షాదీ ముబారక్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు
● క్రీడాకారులకు క్రికెట్ & వాలీబాల్ మైదానం – మినీ స్టేడియం
● అంగన్‌వాడీలు, గ్రంథాలయం, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు
● సావిత్రి బాయి ఫూలే – మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహాల ఏర్పాటు (సొంత ఖర్చులతో)
● ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు
● యువత & మహిళా సంఘాల కోసం ఉపాధి కల్పించే పరిశ్రమల ఏర్పాటు
● ప్రజలతో చర్చించిన తర్వాతనే ప్రతి అభివృద్ధి పనికి శ్రీకారం
నర్సిములు మాట్లాడుతూ“గ్రామంలో చాలావరకు పనులు నిలిచిపోయాయి. వాటిని పూర్తి చేయడం నా మొదటి కర్తవ్యంగా భావిస్తాను. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయను. ప్రజాసేవ కోసంఈ నేల కోసంనేను పోటీ చేస్తున్నాను” అని తెలిపారు.“గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడినా… ప్రజా సేవ మాత్రం ఆపలేదు”తాను గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ ప్రజల కోసం సేవను కొనసాగించానని నర్సిములు భావోద్వేగంతో తెలిపారు.
గ్రామమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు” అని పేర్కొంటూ ప్రజలు మరోసారి ఆలోచించి తనను గెలిపించాలని కోరారు.
వోటర్లకు చివరి విజ్ఞప్తి“వీరారెడ్డిపల్లిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టడానికి మీ ఒక్క ఓటు ఎంతో కీలకం. ఈ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్‌గా నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి” అని ఈరబోయిన నడిపి నర్సిములు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.