📄 ePaper
Friday, September 4, 2026
Homeతెలంగాణరైతుల పాలిట కల్పవృక్షం  ఎఫ్ పి ఓ ను  సద్వినియోగించుకోవాలి పోకల

రైతుల పాలిట కల్పవృక్షం  ఎఫ్ పి ఓ ను  సద్వినియోగించుకోవాలి పోకల

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//గరిడేపల్లి : 

నరేంద్ర మోడీ సారాధ్యంలోని  భారతీయ జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్  ( FPO)   రైతుల పాలిటికల్పవృక్షమని  ప్రతి రైతు సద్వినియోగించుకోవాలని  మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్,  భాజపా జిల్లా నాయకులు పోకల వెంకటేశ్వర్లు కోరారు.మంగళవారం మండలంలోని పొనుగోడు ప్రాథమిక సహకార  సంఘంలో  రు. 2 వేలు చెల్లించి   ఎఫ్ పి ఓ సభ్యత్వం  తీసుకున్న అనంతరం  ఆయన మాట్లాడుతూ.. ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అనేది సన్న  చిన్న కారు రైతులు,  పాల ఉత్పత్తిదారులు,  మత్స్య కారులు,  చేనేత కార్మికులు వంటి ప్రాథమిక ఉత్పత్తిదారులు ఏర్పరచుకునే చట్టపరమైన సంస్థ అన్నారు.   ఇది సభ్యుల ప్రయోజనం కోసం  ఉత్పత్తి, మార్కెటింగ్,  ప్రాసెసింగ్ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తుందని,   ఈ   ఎఫ్ పి ఓ   సభ్యుల ప్రయోజనం కోసం ఉత్పత్తి మార్కెటింగ్ ప్రాసెసింగ్ లాంటి కార్యకలాపాలు చేస్తుందన్నారు.    ఈ సంస్థ చిన్న రైతులకు  మెరుగైన ధరలు  ఇన్ – పుట్  సరఫరాలు  ( విత్తనాలు, ఎరువులు ) మార్కెటింగ్ అవకాశాలు ఇస్తుందన్నారు.   దీనివలన ఆర్థిక ప్రయోగం చేకూరుతుందని  మధ్యవర్తులు దళారుల పీడ విరగడవుతుందన్నారు.   ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఈ సంఘ సభ్యుల ప్రయోజనం కోసం 15 లక్షల రూపాయలు అందిస్తుందని  తెలిపారు.   రైతుల స్వప్రయోజనం కోసం భారతీయ జనతా ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశం మండలంలోని పొనుగోడు సంఘానికి దక్కిందని,  రైతులందరూ అందిపుచ్చుకోవాలని కోరారు.*
ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శి అందే ఉపేందర్,  స్టాప్ అసిస్టెంట్లు  బచ్చు శ్రీనివాస్,  నక్క సురేష్,  తెలగొర్ల వీర్రాజు,,   అటెండర్ నందిపాటి మట్టయ్య,  చామకూరి అంజి తదితరులున్నారు.*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.