📄 ePaper
Tuesday, September 1, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఅనంతారంలో ఐక్యతకు నిదర్శనంగా సన్మాన కార్యక్రమం

అనంతారంలో ఐక్యతకు నిదర్శనంగా సన్మాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

గ్రామాభివృద్ధేలక్ష్యంగా నూతనపాలకవర్గానికి గ్రామస్తుల మద్దతు

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.జనవరి17
ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో శుక్రవారం శ్రీ దుర్గా భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పాలకవర్గానికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన సర్పంచ్ వొల్లల రజిత వెంకటేశం, ఉప సర్పంచ్ కదం జయంత్‌లతో పాటు వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా భవాని ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి తమ మద్దతు తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.